ఒంటి కాలిపై నిలబడి నిరసన.. కొవ్వొత్తుల ప్రదర్శన

 వినుకొండలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

 వినుకొండ: స్థానిక సురేష్‌ మహల్‌ వద్ద రోడ్డుపై అంగ న్వాడీలు ఒంటి కాలిపై నిలబడి వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. 13 రోజులుగా సమ్మె చేస్తున్నామని, ఇంత మంది అంగన్వాడీలను రోడ్డుపైకి తీసు కొచ్చినా ప్రభుత్వానికిి ఏమాత్రం కనికరం లేదా అని వారు ప్రశ్నించారు. అంగ న్వాడీల బాధలను ముఖ్యమంత్రి పట్టించు కోరా అని విమర్శించారు. అంగన్వాడీ సెంటర్‌లో టీచర్‌,ఆయాలు నిర్వహించే బాధ్యత ఎవరు నిర్వహించలేరని, ఆ సం గతి అర్థమయ్యేస్థితిలో ముఖ్యమంత్రి లేక పోవడం దౌర్భాగ్యమని విమర్శిం చారు. సిఐటియు నుండి ఎఎల్‌. ప్రసన్న కుమారి, నాగజ్యోతి, కృష్ణకుమారి, సుజాత, ఆంజ నేయులు, నాసర్‌ బి, ఎఐటియుసి నుండి పి. ఉమాశంకరి, రమాదేవి, పద్మ, ఉమా మహేశ్వరి, సిఐటియు నుండి రంగా,లక్ష్మి ,శ్రీదేవి పాల్గొని నిరసన తెలిపారు.

అమరావతి: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనతో అంగన్వాడి పిల్లలు, బాలింత తల్లులు, గర్భిణులతో అంగన్వాడి సిబ్బంది, సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్‌ పిల్లల తల్లులు, గర్భిణులు, బాలిం తలు మాట్లాడుతూ అంగన్వాడీలు పది నిమిషాలు ఆలస్యం అయితేనే ఆరోజు గైర్హాజరు అయ్యారని, సంబంధిత అది óకారులు వచ్చి సస్పెండ్‌ ఆర్డర్లు ఇస్తా మంటూ బెదిరించిన సంఘట నలు ఉన్నా యన్నారు. ఇప్పుడు సచి వాలయ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది నామ మాత్రంగా అంగన్వాడీ కేంద్రం తీసి వెళ్తున్నారని, వారికి ఆ సస్పెన్షన్‌ ఆర్డర్లు వర్తించవా అని ప్రశ్నించారు. ఇదిలా ఉం డగా సిఎం మనసు మారాలని అంగ న్వాడీలు స్థానిక అమరలింగేశ్వరస్వామి ఆలయంలో మొక్కకున్నారు.

చిలకలూరిపేట: అంగన్వాడీల కేంద్రాల తాళాలు ప గుల కొట్టటం, అంగన్వాడీలను కేం ద్రాలు ప్రారంభించమని బలవంతం చేయడం ప్రభుత్వానికి తగదని అంగన్వాడీ వర్కర్లు అండ్‌ హెల్పర్లు (సిఐటియు) యూనియన్‌ గౌరవాధ్యక్షులు పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. గణపవరంలో అంగన్వాడీ ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తీర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. యూనియన్‌ అధ్యక్షు రాలు జి.సావిత్రి మాటా ్లడారు.

మాచర్ల: స్థానిక అంగన్వాడి స్కూల్‌ వద్ద తల్లి దండ్రులతో కలిసి అంగన్వాడీలు కొవ్వొ త్తుల ప్రదర్శన చేశారు. స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో కూడా ఈ ప్రదర్శన నిర్వ హిం చారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకు రాలు ఉషారాణి,శివ కుమారి, కోటేశ్వరి పాల్గొన్నారు.

➡️