ఓటరు వెరిఫికేషన్‌పై అప్రమత్తంగా ఉండాలి: కందుల

ప్రజాశక్తి-పొదిలి: వచ్చే నాలుగైదు రోజుల్లో బూత్‌ లెవల్‌ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌ఛార్జులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పొదిలి పట్టణంలో పొదిలి, కొనకనమిట్ల మండలాల క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, యూనిట్‌ ఇన్‌ఛార్జులు, బూత్‌ ఇన్‌ఛార్జుల ఇంటిగ్రేటెడ్‌ శిక్షణా కార్యక్రమం పట్టణంలోని తాతిరెడ్డి మిల్‌ ఎదుట ఉన్న స్థలంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కందుల మాట్లాడుతూ వచ్చే నాలుగైదు రోజుల్లో ప్రతి బూత్‌ ఇన్‌ఛార్జులు, యూనిట్‌ ఇన్‌ఛార్జులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, బాట్‌ అప్లికేషన్‌లో ఉన్న తమకు సంబంధించిన బూత్‌లలో ఓటర్‌ వెరిఫికేషన్‌ ఫామ్స్‌లో ఉన్న ఫామ్‌ 6, ఫామ్‌ 7, ఫామ్‌ 8లను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వెరిఫై చేసి తమ మొబైల్‌ ఫోన్లో అప్లోడ్‌ చేయాలని, దాంట్లో ఎటువంటి అవకతవకలు ఉన్నా తక్షణమే సంబంధిత బిఎల్‌ఓలకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్‌ చేయాలని తెలియజేశారు. తక్షణమే భవిష్యత్తు గ్యారంటీ నమోదు ప్రక్రియ, కుటుంబ సాధికారక సభ్యులను నియమించాలని క్లస్టర్‌ ఇన్‌ఛార్జులకు, యూనిట్‌ ఇన్‌ఛార్జులకు, బూత్‌ ఇన్‌ఛార్జులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, యూనిట్‌ ఇన్‌ఛార్జులు, బూత్‌ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

➡️