ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేక శిబిరాలు

ప్రజాశక్తి-రాయచోటి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలలో ముసాయిదా ఓటర్ల జాబితా సవరణపై శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గిరీష రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. శుక్రవారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ముసాయిదా ప్రచురణ నుంచి నేటి వరకు పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌లు, 18-19 యువ ఓటర్ల నమోదు, అనామిలిస్‌ పెండింగ్‌, ముసాయిదా జాబితాలో ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు పెండింగ్‌, ఎపిక్‌ కార్డుల జనరేషన్‌, పంపిణీ, పిఎస్‌ఇలు, డిఎస్‌ఇలు, నోడల్‌ అధికారుల నియామకం, ఓటర్ల జాబితా పై మీడియాలో వచ్చిన అంశాలలో తీసుకున్న చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గిరీష, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఎస్‌డిసి శ్రీలేఖ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను వందశాతం తప్పులు లేకుండా రూపొందించడానికి బాధ్యతాయుతంగా కషి చేయాలన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌ జారీచేసిన మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన సందఠంగా ఫారం 9, 10, 11, 11ఏ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ముసాయిదా జాబితాలో చేర్పులు తొలగింపులు తీసుకున్న పరిష్కార వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలన్నారు. డిసెంబర్‌ 2, 3 శని, ఆదివారాలలో పోలింగ్‌ కేంద్రాలలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలలో బిఎల్‌ఒలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా ఉండేలా కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. డిసెంబర్‌ 9 లోపు పెండింగ్‌ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. అనామిలీస్‌ ఓట్లు, పిఎస్‌ఇ, డిఎస్‌ఇ జనరేషన్‌ పక్కాగా చేయాలన్నారు. బల్క్‌గా అందిన దరఖాస్తులపై కమిషన్‌ నిబంధనలను అనుసరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగు పరిష్కారం చేయాలన్నారు. అర్హులైన ఒక్క ఓటర్ను కూడా తొలగించరాదని స్పష్టం చేశారు. చేర్పులు తొలగింపులు మతులు సంబంధించి బిఎల్‌ఒలు రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. నిరంతరం ఓటర్ల జాబితా స్వచీకరణ పనిలో నిమగం కావాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ నియోజకవర్గ ఈఆర్‌ఒలతో మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒకే రకమైన ఫోటోలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిపోయినవి, మతులు, ఒక ఇంటి నెంబర్‌ పై 10 కంటే ఎక్కువ ఓట్లు, ఒకే వ్యక్తి పేరున రెండు మూడు అంతకన్నా ఎక్కువ ఓట్లు ఉండడం లాంటి సిమిలర్‌ ఓట్ల తొలగింపునకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బాధ్యతాయుతంగా కషి చేయాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శని, ఆదివారాలలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తప్పనిసరిగా ముసాయిదా ఓటర్ల జాబితాపై బిఎల్‌ఒలతో ప్రత్యేక శిబిరం నిర్వహించాలన్నారు. అభ్యర్థనలు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల నిమిత్తం అందిన దరఖాస్తు వివరాలను రిజిస్టర్‌లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్క రించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభ్యర్థనలు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. అలాగే మీడియాలో వచ్చే వార్తలపై కూడా దష్టి సారించి వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా 18, 19 సంవత్సరాల యువ ఓటర్ల నమోదుపై దష్టి పెట్టి నమోదు చేయించాలని ఇందుకు జిల్లాలో యువ ఓటర్ల నమోదు స్వీప్‌ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. స్వీప్‌ కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందించి జిల్లా కేంద్రానికి పంపాలని చెప్పారు. పిఎస్‌ఇ, డిఎస్‌ఇ జనరేషన్‌పై క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️