ఓటు హక్కును వినియోగించుకోవాలి: డిఎస్‌పి

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు డిఎస్‌పి ఎం కిషోర్‌బాబు మండలంలోని అమ్మనబ్రోలు, కనపర్తి, రాపర్ల, మాచవరం, నాగులుప్పలపాడు తదితర గ్రామాల్లో గురువారం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ప్రజలతో అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. రానున్న ఎన్నికల్లో తమఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. పోలీస్‌ శాఖ అండగా ఉటుందని భరోసా కల్పించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లోని ప్రజలకు ఎన్నికల ప్రవర్తనా నియమా వళిపై అవగాహన కల్పించారు. కొట్లాటలకు దూరంగా ఉండాలని, అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ బ్రహ్మనాయుడు, సర్వేయరు నందయ్య, విఆర్‌ఓ భాగ్యారావు, నాగులుప్పలపాడు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️