ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

ప్రజాశక్తి-పొదిలి : ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిడిపిఒ సుధ మారుతి తెలిపారు. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఒ మాట్లాడుతూ ప్రజలు తమకు నచ్చిన వారికి నిర్భయంగా ఓటేయాలన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం నుంచి విశ్వనాథపురం సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ శోభరాణ, అంగన్‌వాడీలు, ప్రజలు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని ఉపాధి హమీ పథకం అధికారి గడ్డం రాంబాబు తెలిపారు. మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చాలా మంది ఉపాధి కూలీలలో ఉపాధి పనులు చేస్తే బిల్లులు చెల్లిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు.ఎన్నికల హామీ పనులకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు

➡️