కంటితుడుపు జీవోలతో కడుపునిండదు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : జీతాల పెంపుదల కోసం అంగన్‌వాడీలో 11రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే పదవీ విరమణ వయసు, పరిహారం పెంపు వంటి కంటి తుడుపు జీవోలతో ప్రభుత్వం సమ్మెను పక్కతోవ పట్టించాలని చూస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరవధి సమ్మెలో భాగంగా శుక్రవారం పార్వతీపురం ప్రాజెక్ట్‌ నాయకులు అలివేలు, గౌరీ మణి ఆధ్వర్యంలో బెలగాం చర్చి కూడలిలో రాస్తారోకో చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ వెంటనే యూనియన్లను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాల, లేకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉదధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు నాయకులు రాజేశ్వరి, ధర్మవతి నేలవేణి, బి.లక్ష్మి, కృష్ణవేణి, రాజేశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.పాలకొండ : సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 26నుంచి ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణరావు, మండల కార్యదర్శి రాము, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, పాలకొండ ప్రాజెక్టు అధ్యక్షులు జి.జెస్సీబారు, బి.అచ్చమ్మ, బి.జ్యోతి, కె.సీతమ్మ, ఎన్‌.ప్రమీల, కె.పావని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.సాలూరు: అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేపట్టిన సమ్మె 11రోజుకి చేరింది. ఈ మేరకు స్థానిక బోసుబొమ్మ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. డిమాండ్లు ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ పట్టణ నాయకులు బి.రాధ, శ్యామల వరలక్ష్మి, మండల నాయకులు ఎ.నారాయణమ్మ, శశికళ, తిరుపతమ్మ, పార్వతి పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : ఎల్విన్‌ పేట కూడలి వద్ద అంగన్‌వాడీలు మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ భద్రగిరి ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు సత్యవతి, కస్తూరి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ట్రెజరర్‌ మండంగి రమణ ఉన్నారు.గరుగుబిల్లి: అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ నాయకులు గౌరమ్మ, మర్రాపు సావిత్రి ఆధ్వర్యాన అంగన్‌వాడీలు గరుగుబిల్లిలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినా వెనక్కి తగ్గేదేలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీలు,హెల్పర్లు పాల్గొన్నారు.పాచిపెంట : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన రాస్తా రోకో నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట జ్యోతి, సిఐటియు నాయకులు టి.ప్రభావతి, కోరాడ ఈశ్వరరావు, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారుకురుపాం : అంగన్వాడీలు చేపట్టే నిరవధిక సమ్మె 11వ రోజుకి చేరుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోవడం దీక్షా శిబిరం నుంచి సిఐటియు జిల్లా నాయకులు కొల్లి గంగునాయుడు ఆధ్వర్యంలో వందలాదిమంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో భారీ ర్యాలీగా నిరసనలు నినాదాలతో బస్టాండ్‌ వరకు వెళ్లి మానవహారం నిర్వహించారు. ఇది కేవలం శాంతియుతంగా నిరసన మాత్రమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించాలని లేదంటే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని నాయకులు హెచ్చరించారు. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో స్థానిక ఎస్‌ఐ వి.షణ్ముఖరావు మానవహారం దగ్గరికి వచ్చి మానవహారం నిరసన విరమించమని అంగన్‌వాడీలను కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.సీతారాం, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, సెక్టార్‌ నాయకులు, అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సీతానగరం: అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోలాటాలు, పాటలు పాడుతూ నిరసన తెలిపారు. అనంతరం స్థానిక హనుమాన్‌ జంక్షన్‌లో అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్‌.రాము, యూనియన్‌ నాయకులు సత్యవతి, సునీత, యశోద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : ప్రభుత్వ తీరుకు నిరసనగా అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళననుద్దేశించి సిఐటియు నాయకులు ఎం.కాంతారావు మాట్లాడుతూ తక్షణమే సిఎం స్పందించి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని, లేకుంటే ఈనెల 26 నుంచి ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు ఎ.పార్వతి, ఎ.దర్శన్‌, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌.సురేష్‌, గిరిజన సంఘం సీనియర్‌ నాయకులు పి.సాంబయ్య తదితరులు నాయకత్వం వహించారు.బలిజిపేట: స్థానిక బస్టాండ్‌ వద్ద అంగన్వాడీలు కోలాటంతో నృత్యం ప్రదర్శించారు అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ అంగన్వాడీలు సమస్యలపై రోడ్డున పడేయడం సిగ్గు చేయటన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు కార్యకర్తలు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. కొమరాడ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెలో భాగంగా అంతర్‌ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో అనంతరం కొమరాడ మండల పరిషత్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావుకు, ఎంఇఒ జె.నారాయణస్వామికి వినతిని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి, అరుకు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి.సింహాచలం, భవన కార్మిక సంఘం నాయకులు యమక గౌర్నాయుడు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు బి.అలివేలు, జ్యోతి, మల్లేశ్వరమ్మ, పద్మ, లలిత, మాధవి, జయమ్మ, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

➡️