కదం తొక్కిన అంగన్వాడీలు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గ్రామ సచివాలయాల వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె ఆపే ప్రసక్తే లేదని అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దొమ్మరాజు భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం మండలాల్లోని సచివా లయ సిబ్బందికి వినతీ పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె 19 రోజులకు చేరిందని, అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ అమలు తదితర విషయాల్లో ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు. గతంలో జరిగిన చర్చల్లో మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తామని అంగీకరించారని, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన జిఒ ఇవ్వలేదన్నారు. అంగన్వాడీ గ్రేడ్‌-2 సూ పర్వైజర్‌ 560 పోస్టులు ఇచ్చామని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అబద్ధాలు ఆడుతు న్నారన్నారు. తమ సమ్మెకు లబ్దిదారుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నాలుగు శాఖలతో తలకిందులుగా తపస్సు చేసిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క పిల్లాడికి కూడా సరైన తిండి పెట్టలేకపోయిందన్నారు. ప్రభుత్వం అద్దెలు ఇవ్వకపోయినా గర్ణి ణులు, బాలింతలకు పోషణ అందించామన్నారు. సచివాలయ కార్యాలయాలకు వెళ్ళి సామూహిక వినతిపత్రాలు ఇచ్చిన్నట్లు చెప్పారు. అప్పటికి సమస్యలు పరిష్క రించకపోతే జనవరి నుంచి పోరాటాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. తమ ఆందోళనలకు రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ లీడర్లు విజయమ్మ, సిద్దమ్మ, నాగమణి, అరుణ, మస్రూన్‌ బీ, సుమలత, వనజ, ప్రవీణ, సబీనా, రమీజా, ఇందిరమ్మ పాల్గొన్నారు. బి.కొత్తకోట :అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె యధావిధిగా కొనసాగుతోంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రభుత్వానికి తమ నిరసనలను తెలియజేస్తున్నారు. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం తాము 19 రోజులుగా నిరవధిక ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీల సమ స్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు పాల్గొన్నారు. మదనపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు హరింద్రనాథ్‌ శర్మ, మధురవాణి, రాజేశ్వరి మాట్లాడుతూతమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : ప్రభుత్వం నిరంకుశత్వానికి, మంత్రులు అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా తహశీల్దారు కార్యాలయం నుండి ఎంపిడిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఎంపిడిఒ కార్యాలయం లోపల సచివాలయ ఉద్యోగుల, ఆన్‌లైన్‌ సమావేశాలు జరుగుతుండగా సిఐటియు నాయకులు వారితో మాట్లాడుతూ సచివాల ఉద్యోగులు, తమ కడుపు కొట్టొద్దని, చట్ట వ్యతిరేక పనులు చేయొద్దని, మీ పనులు మీరు చూసుకోవాలని, తోటి కార్మికులుగా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎండిఒకు వినపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పి.జాన ప్రసాద్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి, అధ్యక్షులు, రమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాధా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మావతి, వెన్నెల, దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పురపాలక పరిధిలోని 21, 22వ సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దష్టికి తీసుకుపోవాలని అడ్మిన్లకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ రాజంపేట ప్రాజెక్టు నాయకులు విజయ, కార్యకర్తలు అనురాధ, అమరావతి పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి గ్రామ సచివాలయం వరకు ర్యాలీగా వెళ్లిన అంగన్వాడీలు సచివాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్ధిగాల్ల శ్రీనివాసులు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధి అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుకుమారి, ఓబులమ్మ, గౌరవ అధ్యక్షులు ప్రభావతమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు

➡️