కనుమరగవుతోన్న కందిపంట

ప్రజాశక్తి – రాయచోటి గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వేరుశనగ పంటలతోపాటు కందిని సాగు చేసేవారు. కానీ నేడు కంది పంట సాగు చేసేవారి సంఖ్య అన్నమయ్య జిల్లాలో గణనీ యంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా వర్షాభావం వల్ల పంటలు వేసే రైతుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు ఇప్పటికే వ్యవసాయం చేసే రైతులు కాయ కష్టం చేసి పంటల సాగు చేస్తు న్నప్పటికీ అకాల వర్షాలు రావడంతో పంట చేతికి సమయంలో దెబ్బతినడంతో రైతులు భారీగా నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరు కుపోతున్నారు. నాణ్యమైన విత్తనాలు లేకపో వడం, కల్తీ మందులు వాడటం వల్ల కూడా పంట దిగుబడి తగ్గుతున్నాయి. గతంలో రైతులు వర్షాలు లేకపోయినప్పటికీ సాగు చేసి ఫిబ్రవరి నెల చివరికి అంత పంట దిగుబడి చేసి కోత కోసేవారు. నేడు కంది పంట సాగు చేయాలంటే ఏ రైతూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఎక్కువ శాతం అరటి, బొప్పాయి, తమలపాకు, టమోటా, మామిడి వంటి పంటలపైనే రైతులు ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. రాబోయే రోజుల్లో కంది పంట వేసే రైతులు కనపడే పరిస్థితి లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ కందులు చాలా బలవర్ధమైన ఆహారం అలాంటి పంటను సాగు చేయకపోవడం, ఎక్కడో సాగుచేసిన కందులను సొమ్ము చేసుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో పిల్లలకు కందులు అంటే బొమ్మలు చూపించి ఇలా ఉంటాయి అంటూ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంటుంది. చిరుధాన్య పంటలు సాగు కూడా గణనీయంగా తగ్గింది. గతంలో సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్నలు, అనుములు ఇలాంటివి చిరుధాన్యాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలను రైతులు సాగు చేసేవారు. నేడు ఈ చిరుధాన్యాలు కూడా అంతంత మాత్రమే సాగు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ లో 363 హెక్టార్లలో సాగు చిన్నమండెం 32, సంబేపల్లి 121, రాయచోటి 141, గాలివీడు 338, లక్కిరెడ్డిపల్లి 265, రామాపురం 277, వీరబల్లి 115, మొలకల చెరువు 276, తంబళ్లపల్లె 119, కురబలకోట 135, పెద్దతిప్ప సముద్రం 369, కొత్తకోట 179, మదనపల్లె 137, నిమ్మనపల్లి 131, రామసముద్రం 147, కంభం వారి పల్లి 150, పీలేరు 101, పెద్దమండెం 152, గుర్రముకొండ 69, కలకడ 70, కలికిరి 148, వాయల్పాడు 134 హెక్టార్లలో సాగు చేశారు. అయితే రబీలో మాత్రం జిల్లాలో కంది పంట ఎక్కడ సాగు చేయలేదుని అధికారులు చెబుతున్నారు.పెట్టుబడి ఎక్కువ.. కంది, ఇతర చిరుధాన్యాలు పంటలు సాగు చేయాలంటే దుక్కి చేయడం, ఎరువులు, మ ందులు, కూలీల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. వర్షాలు సకాలంలో కురవడం లేదు. ప్రభుత్వం కూడా వీటికి నష్ట పరిహారం ఇవ్వడం లేదు. ఈ పంటలు సాగు చేయాలంటే ఇబ్బందిగా ఉంది.-పామయ్య రైతు, పి.ఎన్‌.కాలవ, సుండుపల్లి మండలం.కందిని సాగు చేయలేడం లేదు కందిని ఖరీ ఫ్‌లో మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల రబీలో కంది పంటను రైతులు సాగు చేయడం లేదు. రైతులకు గ్రామీణ ప్రాంతాలలో పలు అవగాహన సదస్సును కూడా నిర్వహిస్తున్నాం.- చంద్ర నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా

➡️