కలెక్టర్‌కు ఉత్తమ ఎన్నికల అధికారి అవార్డు

Jan 25,2024 20:16

 ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఉత్తమజిల్లా ఎన్నికల అధికారిగా అవార్డు అందుకున్నారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ నుండి అవార్డు స్వీకరించారు. ఓటర్ల సవరణ జాబితాలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు రాష్ట్రంలో ముగ్గురు కలెక్టర్లను ఎంపిక చేయగా వారిలో విజయనగరం కలెక్టర్‌ ఒకరు. బిఎల్‌ఒ కేటగిరీలో గాజులరేగకు చెందిన పి.హేమలత కూడా ఇదే వేదిక నుండి అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️