కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన

Feb 24,2024 19:07
అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి
కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజాశక్తి – పొదలకూరు :పేదల ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీని చేరువు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నల్లబాలెంలో శనివారం వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. సర్వేపల్లిలో మట్టి రోడ్డు కనిపించకుండా సిమెంట్‌ రోడ్లు వేశామని తెలిపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అలసిపోయానని, అప్పుల పాలయ్యానని చెబు తున్నారని ఎద్దేవా చేశారు. తొలుత గ్రామంలో రూ. 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. జెడ్‌పిటిసి తెనాలి నిర్మలమ్మ, వైసిపి నాయకులు జి.గోపాల్‌ రెడ్డి, బి. సురేష్‌ కుమార్‌ రెడ్డి, పి .రమ ణారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, పోల్‌ రెడ్డి, నారాయణరెడ్డి, వి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.

➡️