కామ్రేడ్‌ మళ్ల సత్యనారాయణ పోరాట స్ఫూర్తి మరువలేనిది

వర్థంతి కార్యక్రమంలో మళ్ల సత్యనారాయణ కుటుంబంతో లోకనాథం తదితరులు

ప్రజాశక్తి- అనకాపల్లి

కార్మికుల సమస్యలపై స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కీర్తిశేషులు కామ్రేడ్‌ మళ్ల సత్యనారాయణ చూపిన పోరాట స్ఫూర్తి మరువలేనిదని, దానిని కార్యకర్తలు అందిపుచ్చుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. సిపిఎం నాయకులు మళ్ల సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం వారి స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి లోకనాథం హాజరై సత్యనారాయణ సతీమణి సరోజినీ, కుమారులు జగదీష్‌, సుందరవాసులను పరామర్శించారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి వి సత్యవతి, జనసేన నాయకులు కొణతాల రామకృష్ణ, టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు సత్యనారాయణ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొణతాల వెంకటరావు, కాండ్రేగుల సత్యనారాయణ, మల్ల అచ్చయ్య, బొడ్డేడ అప్పలస్వామి నాయుడు, సిపిఎం మండల కన్వీనర్‌ గంట శ్రీరామ్‌, ఐద్వా నాయకురాలు సుభాషిణి, విశాఖ స్టీల్‌ సిఐటియు నాయకులు జె.అయోధ్యరామ్‌, సత్యనారాయణ కుమారులు జగదీష్‌, అన్నదమ్ములు పాల్గొన్నారు.మళ్ల సత్యనారాయణ హెల్త్‌ కేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రారంభంమళ్ల సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్‌ మల్ల సత్యనారాయణ హెల్త్‌ కేర్‌ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. దీనిని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ జి.రామ్మూర్తి, సత్యనారాయణ సతీమణి సరోజినీ, కుమారులు జగదీష్‌, సుందర్‌ వాసులతో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆర్గనైజేషన్‌ పనిచేస్తుందని చెప్పారు. జగదీష్‌, సుందర్‌ వాసు మాట్లాడుతూ తమ తండ్రి సత్యనారాయణ అణగారిన వర్గాల సమస్యలపై పోరాటం చేశారని, ఆయన స్ఫూర్తితో ప్రజలకు ఆరోగ్యంపైనా, ఆహారంపైనా అవగాహన కల్పించడం, వైద్య పరీక్షలు చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ సోదరులు మహేశ్వరరావు, జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️