కార్మిక నేతలపై నిర్బంధం

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీలపై ఎస్మాను ఉపసంహరించుకోవాలని నిరసనగా కార్మిక, ప్రజా సంఘాలు చేపట్టిన జైల్‌బరో కార్యక్రమంపై ప్రభుత్వం నిర్భంధం ప్రయోగించింది. గుంటూరు, మంగళగిరి, పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నాయకుల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి, పోలీసుస్టేషన్లకు తరలించారు. తొలుత గుంటూరులోని మార్కెట్‌ సెంటర్‌ సెంటర్‌ నుండి శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకూ వివిధ కార్మిక, సంఘాల నాయకులు మంగళవారం నిరసన ప్రదర్శన చేశాయి. అప్పటికే శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో పోలీసులు భారీగా మోహరించటంతో నాయకులు శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి వద్ద రాస్తోరోకో చేపట్టారు. కొద్దిసేపు వాహాలను అడ్డుకున్నారు. దీంతో పలీసులు నాయకుల్ని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పాశం రామారావు, జంగాల అజరుకుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దండా లక్ష్మీనారాయణ, వై.నేతాజి, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఇ.అప్పారావు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు యు.గనిరాజు, ఐఎఫ్‌టియు (న్యూ) నాయకులు యు.నాగేశ్వరరావు, సిఐటియు నగర తూర్పు ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, నాయకులు శివాజీ, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ.చిస్టీ, ఐద్వా నగర కార్యదర్శి ఎ.కళ్యాణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజరుకుమార్‌ తదితరులున్నారు. సాయంత్రం 3 గంటల తర్వాత వీరిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతుంటే ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తుందన్నారు. ప్రభుత్వం ఇదే ధోరణితో వ్యవహరిస్తే ఇంటికి సాగనంపుతారని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజి మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న వారిని ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించటం ద్వారా మొత్తం కార్మిక, ఉద్యోగ వర్గానికి ఛాలెంజ్‌ విసిరిందని, దీనికి తగిన గుణపాఠం ప్రభుత్వం ఎదుర్కొంటుందన్నారు.

పల్నాడు జిల్లా కేంద్రంం నరసరావుపేటలోని గడియార స్తంభ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సిపిఎం, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శులు గుంటూరు విజరుకుమార్‌, ఎ.మారుతివరప్రసాద్‌, టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, కౌలు రైతు సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు వై.రాధాకృష్ణ, కె.రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి, జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయ నాయక్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి, రైతుసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.బాలకృష్ణ, ఏపూరి గోపాలరావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా నాయకులు ఏడుకొండలు, పిడిఎం నాయకులు ఎన్‌.రామారావు, నాయకులు సిలార్‌ మసూద్‌, సాల్మన్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆంజనేయరాజు, కె.సాయికుమార్‌, సిపిఐ నాయకులు కె.రాంబాబు, వి.వెంకట్‌, రంగయ్య, వివిధ సంఘాల నాయకులు జి.పిచ్చారావు, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు ఉన్నారు. వీరిని కొద్దిసేపటి తర్వాత స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ సమస్యలపై పోరాడుతున్న అంగన్వాడీలను బెదిరించడం మినహా సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని మండిపడ్డారు.

ప్రజాశక్తి – మంగళగిరి : ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు), అంగన్వాడీల యూనియన్‌, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన, స్థానిక అంబేద్కర్‌ సెంటర్లోని గౌతమ్‌ బుద్ధ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. అక్కడి నుండి నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. కార్యాలయం వద్ద కొద్దిసేపు ధర్నా అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఎం.రవి, జెవి రాఘవులు, వివి జవహర్లాల్‌, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, వివిధ ప్రజాసంఘాల నాయకులు సిహెచ్‌ రామాంజనేయులు, ఎం.పకీరయ్య, ఎం.బాలాజి, డి.రామారావు, జి.దుర్గారావు, వి.మాధవరావు, ఎం.వెంకటేశ్వరావు, ఎ.నాగబాబు, కె.కోటేశ్వరరావు, హేమలత, మేరీ రోజమ్మ, వినీల, రుక్మిణి, తిరుపతమ్మ, ఫాతిమా, కె.సు, వై.శివనాగేశ్వరరావు, పి.పూర్ణ, కె.శివనాగేశ్వరమ్మ, డి.శంకర్‌ పాల్గొన్నారు.

➡️