ఫెడరల్‌ బ్యాంక్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభం

Jun 24,2024 20:19
ఫెడరల్‌ బ్యాంక్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభం

నూతన బ్రాంచ్‌ ప్రారంభంలో బ్యాంకు అధికారులు
ఫెడరల్‌ బ్యాంక్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభం
ప్రజాశక్తి-నెల్లూరుస్థానిక వేదాయపాళెం ప్రాంతంలో ఫెడరల్‌ బ్యాంక్‌ రెండో నూత బ్రాంచ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఫెడరల్‌ బ్యాంక్‌ డిప్యూటీ వైస్‌ ప్రసిడెంట్‌ స్వాత్రి ప్రియ మాట్లాడుతూ 1913 నుంచి దేశంలో తమ బ్యాంక్‌ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 39 బ్రాంచ్‌లు కలిగి ఉన్నామన్నారు. తిరుపతి క్లస్టర్‌ పరిధిలో 14వ బ్రాంచ్‌, నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో మొదటి బ్రాంచ్‌లో జిల్లా వాసులకు సేవలందిస్తున్నామన్నారు. నగరం అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ఫెడరల్‌ బ్యాంకు సేవలు ఖాతాదారులకు మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో వేదాయపాళెం ప్రాంతంలో రెండవ బ్రాంచ్‌ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ముఖ్యఅతిధులుగా కె.శ్రీనివాసులు,కె.సుమతి, కోట సూర్యనారాయణ హాజరయ్యారు.

➡️