కార్యకర్తల కోసమే పోటీ : బొల్లినేని

Feb 23,2024 21:47
ఫొటో : అభివాదం చేస్తున్న టిడిపి నేతలు

ఫొటో : అభివాదం చేస్తున్న టిడిపి నేతలు
కార్యకర్తల కోసమే పోటీ : బొల్లినేని
ప్రజాశక్తి-ఉదయగిరి : యువగళం పాదయాత్రలో కార్యకర్తల కోసం రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆల్‌ కైర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గం టిడిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 అక్టోబర్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, మొదటిసారిగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట కార్యక్రమంలో మొదటిసారిగా ఆ బహిరంగ సభ ఏర్పాటు చేశానని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి కూడా పోటీ చేశానని, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నన్ను ప్రజలు గెలిపించారని తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా మూడు నేషనల్‌ హైవే రోడ్లను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుందని 2019 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశం తనకు లేనప్పటికీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ కోసం ఓడిపోతానని తెలిసి కూడా పోటీ చేశానని తెలిపారు. ఈ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా పార్లమెంట్‌ సభ్యులుగా మంత్రులుగా ఓ కుటుంబం రాజకీయం చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మానవత్వం ఉన్న నాయకులని తనకు న్యాయం చేస్తారన్నారు. పట్టణంలో గడపగడపకు తిరిగినానని ప్రజలు తనకు బ్రహ్మరథం పడ్డారని నారా చంద్రబాబునాయుడు లోకేష్‌ బాబు ఈనాడు తనకు టికెట్‌ ఇవ్వనని చెప్పలేదని సభాముఖంగా తెలిపారు. ప్రతీ కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు హరికృష్ణ మాట్లాడుతూ టికెట్‌పై ఎలాంటి గందరగోళం లేదని రానున్న ఎన్నికల్లో బొల్లినేని వెంకట రామారావు పోటీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు బయన్న అధ్యక్షతన ప్రారంభమైంది. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, మాజీ ఎఎంసి చైర్మన్‌ మన్నేటి వెంకటరెడ్డి, మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌ రియాజ్‌, మాజీ మండల కన్వీనర్‌ బొజ్జ నరసింహులు, ఎస్‌సిసెల్‌ కాకి ప్రసాద్‌, 8మండలాల మాజీ ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు, బూత్‌ కన్వీనర్లు, క్లస్టర్‌ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️