కుస్తీ పోటీల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభ

ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కొయ్యూరు

చిత్తూరులో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగిన 2024 అండర్‌-20 మెన్‌, ఉమెన్‌ ఛాంపియన్‌ షిప్‌ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో కొయ్యూరు రెజ్లింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న గిరిజన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 8 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించినట్లు రెజ్లింగ్‌ కోచ్‌ అంబటి నూకరాజు శుక్రవారం తెలిపారు. అండర్‌-15 విభాగంలో కూడా బాల బాలికలు ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించారన్నారు. వీరంతా ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన గిరిజన విద్యార్థులను, కోచ్‌ అంబటి నూకరాజును పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అభినందించారు. గిరి విద్యార్థులు క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

➡️