ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బాలం వెంకట రమణ

ప్రజాశక్తి – ఆచంట

ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ప్రజల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తున్నామని టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బాలం వెంకట రమణ అన్నారు. ప్రజల వద్దకే నాయకులు కార్యక్రమంపై ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ పిలుపులో భాగంగా కొడమంచిలి గ్రామంలో సోమవారం టిడిపి నేతలు ప్రజా సమస్యలు తెలుసుకుని వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కుంటపడిందని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చంధంగా ఉన్నాయన్నారు. గ్రామాల మార్పుకు టిడిపి నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి చిలుకూరు వీర వెంకట సత్యనారాయణ మూర్తి, నేతలు కుసమే నరసింహమూర్తి, కట్టా సుబ్బారావు, నెక్కంటి పెద్దబాబు, చిలుకూరి శ్రీను, రాపాక ఆనందరావు, మన్నే తేజ, జీవన్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

➡️