కేంద్రం రూ.5వేల కోట్లు ఇవ్వాలి : ఎంపి గల్లా జయదేవ్‌

Dec 5,2023 21:08
పార్లమెంట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి గల్లా జయదేవ్‌

కేంద్రం రూ.5వేల కోట్లు ఇవ్వాలి : ఎంపి గల్లా జయదేవ్‌ప్రజాశక్తి – రేణిగుంట ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్‌ తుఫాన్‌ వలన జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం 5000 కోట్లను వెంటనే మంజూరు చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. మంగళవారం పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ మిచౌంగ్‌ తుఫాను ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సష్టించిందన్నారు. తుఫాను ప్రభావంపై కేంద్ర బందాన్ని పంపి మధ్యంతర ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం దష్టికి తీసుకుచ్చారు. ఈ తుపాను రైతులకు కన్నీళ్లు తెప్పించి కోతకు సిద్ధంగా ఉన్న పంట కళ్ల ముందే పోయిందన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. పార్లమెంట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి గల్లా జయదేవ్‌

➡️