కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

మండపేటలో అంబేద్కర్‌ విగ్రహనికి అంగన్‌వాడీల వినతిజీతాలు పెంచాలని

ప్రజాశక్తి-మండపేట

న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం వారు పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండపేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు అంగన్‌వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్‌వాడీకేంద్రాలు తెరిచేది లేదన్నారు. వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జిఒ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడిలు నాయకులు అంగన్‌వాడీ నాయకులు బేబీ, రాణి, జానకి, సూర్యకుమారి, కుమారి, కష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం అంగన్‌వాడీ వర్కరు సమ్మెలో భాగంగా రామచంద్రపురం మెయిన్‌ రోడ్‌ లో 29 రోజులు సందర్భంగా 29వ రోజు అనుకరిస్తూ అంకెలలో కూర్చుని నిరసన తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలని మెయిన్‌ రోడ్డుపై బైఠాయించి అక్కడే నిరసన తెలిపారు. మెయిన్‌ రోడ్డుపై అంగన్‌వాడీ వర్కర్లు బయట వేయించడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎం దుర్గ, నూకల బలరాంలు మాట్లాడుతూ 29 రోజులుగా అంగన్‌వాడీ వర్కర్లు చేస్తున్న నిలవదుల సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అంగన్‌వాడీ వర్కర్లపై యస్మప్రయోగించడం జిఒ రెండును ఉపయోగించడం వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్గొనవద్దని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రామచంద్రపురం, కె.గంగవరం మండలం నుండి సుమారు 400 మంది అంగన్‌వాడీ వర్కర్లు ఆయాలు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని జీతాలు పెంచాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

➡️