కొనసాగుతున్న టిడిపి బైక్‌ ర్యాలీ

Feb 4,2024 20:46

ప్రజాశక్తి- వేపాడ: మండలంలోని వేపాడ, వల్లంపూడి, ఎఎస్‌పేట, జగ్గయ్యపేట, అరిగిపాలెం, కొత్త సింగరాయి, ఆతవ గ్రామాల్లో ఆదివారం టిడిపి బైక్‌ ర్యాలీ ఐదో రోజు కొనసాగింది. బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండలంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో భాగంగా సింగరాయి గ్రామంలో సామాజిక కార్యకర్త ఆర్‌ అప్పారావు ఏర్పాటు చేసిన వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ టిడిపి మినీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఒక వేళ పరిష్కారం కాకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకు ప్రతి ఒక్కరూ చంద్రబాబును గెలిపించుకోవాలన్నారు. ఎన్నికల ముందు మెగా డిఎస్‌సి పేరిట జగన్‌ దగా డిఎస్‌సిని ప్రకటించారని ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, నియోజకవర్గం మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, నాయకులు జనపరెడ్డి ఈశ్వరరావు, రాయవరపు చంద్రశేఖర్‌, గోరుపోటు వెంకటరమణ, గొర్లి నాగరాజు, సిరికి రమణ, మంచిన అప్పలసూరి, పల్లి ధనుంజయ, కెపి నాయుడు, కొట్టాన అర్జునరావు, ముక్క రామకృష్ణ, సేనాపతి గణేష్‌, తాడి కృష,్ణ జగన్‌, వై.సూర్యం, సిరికి నాయుడు, రమేష్‌, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

➡️