కొనసాగుతున్న నిరశన సమ్మె

Mar 16,2024 21:03

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరశన సమ్మె శని వారం స్థానిక ఆర్‌ఒబి వద్ద 45వ రోజు కొనసాగింది. మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి. వి. రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేశ్‌ మాట్లాడుతూ శుక్రవారం విశాఖపట్నం జెసిఎల్‌ వద్ద చర్చలు జరిగాయని ఆ చర్చల్లో జెసిఎల్‌ జీతాలు రెండు రోజుల్లోగా చెల్లించి, సమస్యలు పరిష్కారానికి తన వంతు చొరవ చూపించి అప్పటికీ పరిష్కారం జరగక పోతే వచ్చే గురువారం మరోసారి చర్చలు జరుపుతామని చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వం, మిమ్స్‌ యాజమాన్యం స్పందించి న్యాయమైన సమస్యలు పరిష్కరించి జనవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో ఉద్యోగులు ఎం.నారా యణ, కె. కామునాయుడు, కె.మధు, గౌరి, మూర్తి, ఎం.నాగ భూషణం, అప్పల నాయుడు, వరలక్ష్మి, బంగారునాయుడు, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️