కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

ప్రజాశక్తి మద్దిపాడు : అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజూ గురువారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఉబ్బా ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లు నేపథ్యంలో అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హత కలిగిన ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఈ దీక్షలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు జయప్రద, అంగన్‌వాడీలు గోవిందమ్మ, ధనలక్ష్మి, రజని, వరలక్ష్మి, శ్రీదేవి, అంజమ్మ, నిర్మల, యశోద, సుశీల, శారద పాల్గొన్నారు.

➡️