కౌంటింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలన

Mar 8,2024 19:56

ప్రజాశక్తి-డెంకాడ : ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు కోసం వివిధ కళాశాలల భవనాలను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ముందుగా డెంకాడ మండలం లెండి కళాశాలను సందర్శించారు. అక్కడ మ్యాప్‌ లను, భవనాలను క్షుణంగా పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుపై ఆర్‌డిఒ ఎం.వి.సూర్య కళ, లెండి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వివి రమణా రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హరిబాబు, డాక్టర్‌ శైలజ తదితరులతో చర్చించారు. పర్యటనలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️