క్రీడా పరికరాలు పంపిణీ

Dec 8,2023 21:16

 ప్రజాశక్తి -సీతానగరం  :   ఈనెల 15 నుంచి జరగనున్న ఆడుదాం…. ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన క్రీడా పరికరాలను ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా గ్రామ స్థాయిలో ఆటలు సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసి గెలుపొందిన వారిని మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్రస్తుతానికి వెళ్లడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో 14 ఏళ్ల నుంచి యువతీ, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇ.ప్రసన్నలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.మక్కువ: మండలంలోని 17 సచివాలయాలకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కిట్లను శుక్రవారం అందజేశారు. స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో వైసిపి మండల నాయకులు ఎం.రంగు నాయుడు సచివాలయ కార్యదర్శులకు అందజేశారు క్రికెట్‌ వాలీబాల్‌ షటిల్‌ రింగ్‌ ఆటలకు సంబంధించిన వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమంలో అన్ని సచివాలయాల కార్యదర్శులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారుగరుగుబిల్లి : ఎంపిడిఒ జి.పైడితల్లి చేతుల మీదుగా సచివాలయాలకు వివిధ రకాల ఆటలకు సంబంధించిన స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ చేయడం జరిగింది.

➡️