గర అభివృద్ధికి కృషి : కోలగట్ల

Feb 1,2024 21:34

నప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఇప్పటికే లక్షలాది రూపాయలతో నగరాన్ని సుందరీకరణ చేశామన్నారు. రామారాయుడు రహదారిలో నూతనంగా నిర్మించిన బిటి రోడ్డును డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిజ్య సంఘం ప్రతినిధులు కేదారశెట్టి సీతారామమూర్తి, కాపుగంటి ప్రకాష్‌ మాట్లాడుతూ నగరానికి ప్రధాన వ్యాపార కూడలిగా ఉన్న రామారాయుడు రోడ్డు గతకలమయంతో ఉండేదని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో కోటి రూపాయలతో రహదారి సౌకర్యాన్ని కల్పించారన్నారు. త్వరలోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ సెంటర్లో ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చులయా యాదవ్‌, వైసీపీ నాయకులు యడ్ల రాజేష్‌, బలివాడ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గడప గడపకూ డిప్యూటీ మేయర్‌

డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి 3వ డివిజన్‌ డబుల్‌ కాలనీలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌ మారోజు శ్రీనివాసరావు,వైసిపి నాయకులు మెండా రమణ, వేముల శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️