గానకోకిల సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

Apr 1,2024 21:45

 మణిశర్మ, వి.సుబ్రమణ్యంలకు సత్కారం

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయని, గానకోకిల, పద్మభూషన్‌ డాక్టర్‌ పి.సుశీలకు విజయనగరానికి చెందిన శ్రీ గురు నారాయణ కళా పీఠం ఆధ్వర్యాన పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. సోమవారం రాత్రి స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో గురు నారాయణ కళాపీఠం తృతీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సుశీలకు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, అలనాటి లవకుశ సినిమాలో కుశుడు పాత్ర పోషించిన వి.సుబ్రమణ్యంలకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ చాలా కాలం తరువాత సొంతూరు విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను నడయాడిన నేలలో అడుగుపెట్టుడం ఎంతో అనుభూతికి గురయ్యాయన్నారు. సంగీతం పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా లవకుశ సినిమాలో పాట పడి అందరినీ అలరించారు.

గానకోకిల సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

నగర డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ మన సంస్కతిసంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. శుభ శివ రావు మాట్లాడుతూ సుశీల పాట వింటుంటే ప్రతి ఋతువు వసంత ఋతువు అన్నారు. ప్రస్తుతం రోజుల్లో సంగీతానికి విలువైన ఇవ్వాలన్నారు. .ముందుగా బిఎ నారాయణ ఆధ్వర్యాన సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో సంస్థ గౌరవాధ్యక్షులు డోల మన్మధ కుమార్‌, అధ్యక్షులు డాక్టర్‌ గేదెల సన్యాసమ్మ, ప్రధాన సలహాదారు సాంబశివరావు, యార్లగడ్డ బాబురావు, ఉప్పు ప్రకాష్‌ , డాక్టర్‌ ఎ.గోపాలరావు, సిఐ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

➡️