గురుదేవ ఆసుపత్రికి చెక్కు అందజేత

Mar 17,2024 21:03

ప్రజాశక్తి – కొత్తవలస : గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ విజయశ్రీ జ్ఞాపకర్థం ఉప్పలపాటి ఫౌండేషన్‌ సౌజన్యంతో వి.రాజు 100 పడకల కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డాక్టర్‌ విజయశ్రీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి రూ.2.50కోట్లు చెక్కును విరాళంగా అందించారు. గురుదేవ చారిట బుల్‌ ట్రస్ట్‌ అండ్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ రాపర్తి జగదీశ్‌ కుమార్‌ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో 20 మంది వికలాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, చేతులు, బ్లైండ్‌ స్టిక్స్‌, చెవిటి మిషన్‌లు, పోలియో కాలిపర్స్‌, 75 మందికి పైగా అందులకు బ్లైండ్‌ స్టిక్స్‌, పెన్షన్స్‌, ముసలి వాళ్ళకి రేషన్‌ పంపిణి చేశారు. 50 మంది చిన్న పిల్లలకు జాన్సన్‌ బేబీ కిట్స్‌, ఫీడింగ్‌ బాటిల్స్‌ అందించారు. గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ అండ్‌ హాస్పిటల్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️