గుషిణిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Nov 30,2023 20:27

 నెల్లిమర్ల: మండలంలోని గుషిణిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పల నాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పివివి సూర్య నారాయణ రాజు గురువారం ప్రారంభిం చారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌, గుషిణి నుండి అలుగోలు వరకు వేసిన బి.టి.రోడ్డును వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వైసిపికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ళ సుధారాణి, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీరాములు నాయుడు, డిసిసిబి వైస్‌ చైర్మన్‌ చనమల్ల వెంకట రమణ, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాస రావు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ జమ్ము అప్పల నాయుడు, ఎంపిటిసి చనమల్ల స్వాతి పాల్గొన్నారు.

➡️