గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు

ప్రారంభంప్రజాశక్తి – చాపాడుజిల్లాలో నూతనంగా నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మా ణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా చాపాడు మండల పరిధి లో పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది జిపిఎస్‌ విధానంలో సర్వే రాళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మండల పరిధిలో భూసేకరణలో భాగంగా గుర్తులు ఏర్పా టు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించారు. కొంతమంది రైతులకు నష్ట పరిహారం అందలేదు. అలాంటి రైతుల వివరాలు సేకరించి పరిహారం అందేలా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం, బూడిదపాడు, కుచ్చుపాప, అల్లాడుపల్లె, సోమాపురం, పిచ్చపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 350 ఎకరాల వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా కోడికొండ వద్ద హైదరాబాద్‌-బెంగళూరు 44వ జాతీయ రహదారి నుంచి చెన్నై, కోల్‌కత్తా హైవేపైకి నూతనంగా నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం చేపట్టేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇం డియా చర్యలు తీసుకుంటోంది. పాత రోడ్డు కాకుండా పూర్తిగా నూతన నాలుగు వరు సల రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. అందుకోసం జిల్లాలో 125 కిలో మీటర్లు మేర రోడ్డు నిర్మించేందుకు 1100 హెక్టార్లు భూములను వినియోగిం చనున్నది. 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మన జిల్లా నుండి సుల భంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో పులివెందుల, కమలాపు రం, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలు గుండా నిర్మించేందుకు డిపి ఆర్‌ సిద్ధం చేశారు. ప్రస్తుతం నేషనల్‌ హైవే అథారిటీ సిబ్బంది మండల పరిధిలో రోడ్డు నిర్మించే ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి పిల్లర్లు వేసి సర్వే కూడా పూర్తి చే శారు. ప్రస్తుతం జెసిబి యంత్రాల ద్వారా పంట పొలాలను చదును చేస్తున్నారు. ఈ వేసవిలో రోడ్డు పనులు వేగవంతం చేస్తారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. యర్ర గుంట్ల నుంచి పోరుమామిళ్ల వరకు మెగా సంస్థ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

➡️