గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతం

Feb 25,2024 23:47

గుంటూరులో టిజెపిఎస్‌ కాలేజీలో పరీక్షా కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న అభ్యర్థులు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో పరీక్షల తీరును పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌

ప్రజాశక్తి – గుంటూరు, పల్నాడు జిల్లా : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలలో 28,209 మంది అభ్యర్థులకుగాను 23,334 మంది (82.7 శాతం) హాజరయ్యారు. 4875 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. గుంటూరులో పట్టాభిపురంలోని టిజెపిఎస్‌ కాలేజి పరీక్షా కేంద్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. వట్టిచెరు కూరు మండలంలోని మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్‌ కాలేజిని, చౌడవరంలోని ఆర్‌విఆర్‌ అండ్‌ జెసి ఇంజినీరింగ్‌ కాలేజిని, గుంటూ రులోని ఆంధ్రా ముస్లిం కాలేజి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి జిల్లా సంయుక్త కలెక్టర్‌, పరీక్ష కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ అయిన జి.రాజకుమారి పరిశీలించారు. పరీక్ష ముగిసిన తర్వాత మొత్తం సామగ్రిని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచే వరకూ జేసీ పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటి ష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్య ర్థులు వారి సెల్‌ఫోన్లను కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అప్పజెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ పరిశీలి ంచారు. రామిరెడ్డిపేటలోని శ్రీ చైతన్య జూని యర్‌ కాలేజి, కృష్ణవేణి డిగ్రీ కాలేజి, పల్నాడు బస్టాండ్‌లోని ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీల్లో కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లోని పలు రూములను ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి అజరుకుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.

➡️