గ్లకోమా వ్యాధిపై అవగాహన ర్యాలీ

గ్లకోమా వ్యాధి

ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రపంచ గ్లకోమా అవగాహన వారోత్సవాలలో భాగంగా జిల్లా అంథత్వ నివారణ సంస్థ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల వద్ద డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ పి.జగదీశ్వరరావు ర్యాలీని ప్రారంభించగా, సత్యం జంక్షన్‌ మీదుగా రామా టాకీస్‌ వరకు సాగింది.అంతకుముందు కంటి ఆసుపత్రి ఆవరణలో వైద్య.విద్యార్థులు కన్ను ఆకృతిగా ఏర్పడి కూర్చున్నారు. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.జ్యోతిర్మయి, డాక్టర్‌ రమణ, డాక్టర్‌ ప్రేమలత, డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ వాణిశ్రీ, డాక్టర్‌ సౌజన్య, డాక్టర్‌ శ్రీలక్ష్మి, పిఎంఒలు ఉమా శ్రీనివాస్‌, సురేష్‌ సుబ్బలక్ష్మి, సుజాత, వైద్య విద్యార్థులు, హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు

➡️