ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

ప్రజాశక్తి-దొనకొండ: స్థానిక ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో టీడీపీ యువనాయకుడు కుందుర్తి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో టీడీపీ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి మంగళవారం రాత్రి ఘనంగా ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు. టీడీపీ చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్యయాదవ్‌, దర్శి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి, మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు, సినిమా, రాజకీయ రంగాలకు ఆయన సాధించిన విజయాలు ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని ప్రజలకు వారు వివరించారు. ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటు చేసిన ఒబ్బాపురం టీడీపీ యూత్‌ సభ్యులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటస్వామి, సుబ్బారెడ్డి, యల్లారెడ్డి, కె సుబ్బారావు, పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఒబ్బాపురం ఎన్టీఆర్‌ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

➡️