ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి

Mar 13,2024 21:37

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, జిల్లా సాలివాహన సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తూరు శంకరరావు మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ మాట్లాడుతూ మొల్లమాంబ దేశం గర్వించదగ్గ మహిళ అని, భావితరాలకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు. తెలుగు భాషలో మొట్ట మొదట కవయిత్రిగా రామాయణ కావ్యాన్ని రాసి ఆమె అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారని కొనియాడారు. జిల్లా సాలివాహన సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తూరు శంకరరావు మాట్లాడుతూ మొల్ల జీవిత విశేషాలను తెలిపారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి కృష్ణ, శాలివాహన సంఘం జిల్లా కమిటీ జనరల్‌ సెక్రటరీ ఉరిటి యాదవ్‌, ప్రతినిధులు ఎస్‌. ఈశ్వరరావు, సిహెచ్‌ రమణ, ఒ.దారబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️