ఘనంగా కార్టూనిస్టు బాపు జయంతి

Dec 14,2023 19:46
బాపు జయంతి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు

బాపు జయంతి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు
ఘనంగా కార్టూనిస్టు బాపు జయంతి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు ప్రముఖ కార్టూనిస్ట్‌ బాపు జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తోటపల్లిగూడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాపు జయంతి వేడుకలను పురస్కరించుకొని శ్రీ కళా లయ (నెల్లూరు) ఆధ్వర్యంలో పాఠశాలలోని పిల్లలందరికీ డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు గూడూరు లక్ష్మీ, ఆర్టిస్ట్‌ హరినాథ్‌, డ్రాయింగ్‌ టీచర్‌ గజేంద్ర సమక్షంలో చిత్రలేఖన పోటీలలో విజేతలకు బహు మతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

➡️