ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Dec 25,2023 21:21

ప్రజాశక్తి – కురుపాం : మండల కేంద్రంలో గల రావాడ రోడ్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న గుడ్‌ సమారిటన్‌ లూథరన్‌ చర్చిలో పాస్టర్‌ రెవరెండ్‌ పి.జీవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవల కుటుంబ సభ్యులతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దోనక జాన్‌, దొనక రాజారత్నం, కోట సుందర సుదర్శన్‌, దొనక ప్రదీప్‌, దోనక జయ కుమార్‌, కోట ఈశ్వర రావు, దొనక మజ్జిబాబు, రత్నమ్మ, సుకన్య, సుధా తదితరులు పాల్గొన్నారు.సీతానగరం: మండలంలోని పెదబోగిలి, చినబోగిలి, బూర్జ, మరిపువలస, నిడగల్లు, లచ్చయ్యపేట, అంటిపేట, కాజీపేట, చరిత్ర గ్రామాలలో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఫాదర్లు చర్చి పెద్దలతో ఊరేగింపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న భోగిలి సర్పంచ్‌ కురుమల శ్రీనివాసరావు, రాధాతో బాటు ఫాదర్స్‌ తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్‌: జిల్లా కేంద్రంలో ఉన్న పలు చర్చిలలో క్రిస్మస్‌ వేడుకలను ఆయా సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పండా వీధిలో ఉన్న తిరు కుటుంబ దేవాలయంలో రెవరెండ్‌ ఫాదర్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వీటితో పాటు బెలగాం లూథరన్‌ చర్చి, విశాఖ పరిశుద్ధ లూథరన్‌ చర్చి బిషప్‌ బి. సుదర్శన్‌ రావు, సభ్యులకు ఏసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు. ఎడిషనల్‌ రెవరెండ్‌ పాస్టర్‌ రామారావు ప్రత్యేక ఆశీర్వాద కార్యక్ర మాన్ని నిర్వహించారు. పరిశుద్ధ ధార్మిక జోజప్ప, తిరు కుటుంబ ఆలయంలో రెవరెండ్‌ ఫాదర్లు బాలజోజి, జయపాల్‌ పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు.గుమ్మలక్ష్మీపురం: జియమ్మ వలస మండలం చినమేరంగిలో క్రిస్మస్‌ వేడుకల్లో మన్యం జిల్లా వైసిపి అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్‌ రాజు పాల్గొని ప్రార్థనలు చేశారు. పెద్దబుడ్డిడి, చినబుడ్డిడి, చినకుదమ, జియమ్మవలస గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో తాడికొండ, ఎల్విన్‌ పేట, కేదారిపురం, మండ, గుమ్మలక్ష్మీపురం చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రార్ధనలు నిర్వహించారు. జియమ్మవలస మండలం కుదమ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో టిడిపి అరకు పార్లమెంటరీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొంగు సురేష్‌, మాజీ జెడ్‌పిటిసి డొంకాడ మంగమ్మ, టిడిపి సీనియర్‌ నాయకులు మరడాన అప్పలనాయుడు, సర్పంచ్‌ చేరుకుబిల్లి గిరి, పాస్టర్‌ తలగాపు రాము ఉన్నారు.సీతంపేట: లొయోలా సంస్థ ఆధ్వర్యంలో పత్తికగూడలోని ఆర్సీయం చర్చి వద్ద క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. విచారణ గురువులు విద్యాసాగర్‌, పీటర్‌లు ఆరాధనలు చేశారు. బాలయేసు పుట్టుకను తెలియజేసే నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మఠకన్యలు ఝాన్సీ, సుదీప్త తదితరులు పాల్గొన్నారు. బలిజిపేట: అర్చర గ్రామంలో క్రిస్మస్‌ వేడుక సందర్భంగా పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: మండల కేంద్రంలోని తెలుగు బాప్టిస్ట్‌ చర్చ్‌, ఆర్‌.సి.యం దేవాలయాలతో పాటు తూడి, చిట్టుపూడి వలస, బిటివాడ, తలవరం, నీలానగరం తదితర గ్రామాల్లో భక్తులు నూతన వస్త్రాలు ధరించి ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెవరెండ్‌ పాస్టర్‌ సుకుమార్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ బాలుడు జన్మించిన ఆయనే లోకానికి రక్షకుడని వివరించారు. భామిని: స్థానిక చర్చ్‌లో ఫాదర్‌ థామస్‌ రెడ్డి ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రేత్యేక ప్రార్ధన నిర్వహించి, క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా బైబిల్‌, ఏసు పుట్టుక సారాంశం ను తెలిపారు. ఈ కార్యక్రమంలో కానోసా సిస్టర్‌, సర్పంచ్‌ లోపింటి రాజేష్‌, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

➡️