ఘనంగా క్రిస్మస్‌ హై టీ

ప్రజాశక్తి – పార్వతీపురం:  క్రిస్మస్‌ సందర్భంగా జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ హై టీ కార్యక్రమాన్ని స్థానిక లయన్స్‌ కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెసి మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, వారి బోధనలు శాంతిని ప్రబోదిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. ఏసుప్రభు గీతాలకు బాలికలు నృత్యం చేశారు. బిషప్‌ సుదర్శనరావు, తిమోతి ఏసు బోధనలు తెలియజేసారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్శన్‌ బోను గౌరీశ్వరి, ఫాస్టర్లు సుధీర్‌ చంద్ర, సూర్యప్రకాశ్‌, ఎన్‌.జోషప్‌, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ సూపరింటెండెంటు సత్యనారాయణరాజు, ప్రజలు హాజరైనారు.

➡️