ఘనంగా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు

Jan 23,2024 21:30

ప్రజాశక్తి – కురుపాం: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన్నాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేశ్‌ చంద్ర దేవ్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎంపి వైరిచర్ల చంద్ర ప్రదీప్‌దేవ్‌ హాజరై కేక్‌ కటింగ్‌ పేదలకు చీరలు, స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పరిపాలనతో ప్రజలు విసిగి చెందారని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, అరుకు పార్లమెంట్‌ బిసి సెల్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, అరుకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సీతంపేట : మండలంలోని కీసరజోడులో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలను టిడిపి నేత పడాల భూదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సవర కుంపి, సీనియర్‌ నాయకులు సవర మంగయ్య, పువ్వల కైలాష్‌, ఆరిక మురళి, ఆరిక రామయ్య, బిడ్డిక ప్రసాద్‌, ఆరిక చందు, నిమ్మక సత్యం, ఉర్లక సుగ్రీవులు, కడ్రక వరలక్ష్మి, బిడ్డిక వరహాలమ్మ, ఊయక కనకమ్మ, తోయిక సావిత్రమ్మ, ఆరిక నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.పాలకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు మంగళవారం స్థానిక నక్కలపేట సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా వచ్చిన అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, మాజీ కోఆప్షన్‌ సభ్యులు సుంకరి అనిల్‌దత్‌, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.గుమ్మలక్ష్మీపురం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్‌ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు రొట్టెలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పాడి సుదర్శన్‌ రావు, నియోజకవర్గ మహిళా కార్యవర్గ కార్యదర్శి వెంకట భారతి, తాడంగి రామారావు, పోలూరు శ్రీనివాసరావు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ వెంకట్రావు, దాసు, నాయకులు కోటేశ్వరరావు, ధర్మారావు, నాగవేణి, మాసయ్య, ధర్మారావు తిరుపతిరావు, యువరాజు, గౌరీ శంకర్‌, రవి, జానకి, చిన్నా, శరత్‌ పాల్గొన్నారు.టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక పద్మ ఎల్విన్‌ పేటలో కేక్‌ కట్‌ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక కొండలరావు, నాగేశ్వరరావు పార్వతీపురం రూరల్‌: లోకేష్‌ జన్మదిన వేడుకలు మంగళవారం పార్వతీపురం టిడిపి నాయకులు వేరువేరు చోట్ల ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డి శ్రీదేవి కేకు కట్‌ చేసి నాయకులకు శ్రేణులకు తినిపించారు. బైపాస్‌ రోడ్‌ లో ఉన్న టిడిపి నియోజకవర్గ కార్యాలయంలో ఇన్చార్జి బోనాల విజరు చంద్ర ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

➡️