ఘనంగా శ్రీనివాస రామానుజన్‌ జయంతి

ప్రజాశక్తి-బల్లికురవ: గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాస రామానుజన్‌ జయంతిని శుక్రవారం బల్లికురవ జడ్‌పి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు గోలి శ్రీనివాసరావు, శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ‘ముగ్గుల్లో మాథ్స్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ముగ్గులు వేసి అందులో సంకలనం, వ్యవకలనం, భాగహారం, గణితంలోని వివిధ సూత్రాలను ప్రదర్శించారు. మండల విద్యాధికారి రమేష్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అనంతరం జరిగిన సమావేశంలో మన నిత్య జీవితంలో లెక్కల ఆవశ్యకతను ఉపాధ్యాయులు వివరించారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హనుమంతరావు, ఉపాధ్యాయులు రవీంద్ర బాబు, వై శ్రీనివాసరావు, వెంకటరావు, బి శ్రీనివాసరావు, అచ్యుత మోహన్‌, నటరాజా, గంగవరపు సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. కనిగిరి: ఐ కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా జాతీయ దినోత్సవం వేడుకలు శుక్రవారం పాఠశాల డైరెక్టర్‌ షేక్‌ రజియా, ప్రిన్సిపల్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గణిత దినోత్సవ ప్రాముఖ్యత గురించి, గణిత భావనల గురించి చిన్నారులలో ప్రాథమిక స్థాయి నుంచి తేలికగా అర్థమయ్యే విధంగా అభ్యసనం జరగాలన్నారు. రామానుజం గణితానికి చేసిన కృషి గురించి వివరించారు. అనంతరం చిన్నారుల గణిత ప్రాజెక్టులను ప్రదర్శించారు. రకరకాల ప్రాజెక్టులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రియదర్శిని, గీత, లలిత, వరలక్ష్మి, మెరిన్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు. హనుమంతునిపాడు: విద్యార్థులు గణితం ప్రాముఖ్యతను గుర్తించాలని మహమ్మదాపురం ప్రధానోపాధ్యాయులు వై శ్రీనివాసులు అన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమంతుని పాడు మండలం మహమదాపురం ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన టిఎల్‌ఎమ్‌ ప్రదర్శన, వ్యాసరచన, వ్యాఖ్యాత పోటీలు, లఘు నాటికలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నిత్య జీవితంలో గణితం ఉపయోగాన్ని విద్యార్థులు గుర్తించి గణితాన్ని చక్కగా అభ్య సించాలని సూచించారు. అనంత రం పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, గణిత ఉపాధ్యాయులు దద్దాల శ్రీనివాసులు యాదవ్‌, నాగమణి, చిన్న బాలయ్య, మర్రి మోషే తదితరులు పాల్గొన్నారు.

➡️