చంద్రబాబు తోనే రాష్ట్రాభివద్ధి:’మండిపల్లి’

ప్రజాశక్తి-రామాపురం టిడిపి అధ్యక్షులు చంద్రబాబుతోనే రాష్ట్రం అభివద్ధి జరుగుతుం దని రాయ చోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలం లోని చిట్లురు పంచాయతీలోని చెరువు ముందరపల్లి, కొండవాండ్లపల్లి దళితవాడ, రాఘవరెడ్డిగారిపల్లి, చేనిక్కాయలపల్లి, మజ్జిగ వాండ్లపల్లి, ముసలిరెడ్డి గారిపల్లి, చిట్లురు కస్పా, నారాయణరెడ్డిగారిపల్లి దళిత వాడ గ్రామాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన ముసిరెడ్డిగారిపల్లిలోని గాలివీటి సురేంద్ర నాథ్‌రెడ్డి స్వగహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి పార్టీకి అండగా నిలిస్తే నియోజకవర్గమంతా అభివద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రజాస్వామ్యంలో భాగంగా ఏపార్టీ నాయకులైనా ప్రచారం చేసుకోవొచ్చునని అధికార దర్పంతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి టిడిపి నాయ కులను,కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.టిడిపి కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఏ సమస్య వచ్చిన తమ దష్టికి తీసుకువస్తే మీ సమస్యను నా సమస్యగా తీసుకుంటానాని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.40 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరికమండలంలోని చిట్లురు గ్రామంలో రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా చిట్లూరు దళితవాడలో బాలిపోగు చిన్నప్ప ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మాజీ జడ్‌పిటిసి నాగసు బ్బారెడ్డి, టిడిపి నాయకులు గడికోట భాస్కర్‌రెడ్డి, బాలిశెట్టి చంద్రమౌళి, గాలివీటి సురేంద్రరెడ్డి. చిన్న కష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, రమేష్‌ రెడ్డి, ఈశ్వరయ్య, వెంకటరమణ, దర్బార్‌, చిన్నప్ప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️