చంద్రబాబు సభను జయప్రదం చేయండి : ‘నల్లారి’

ప్రజాశక్తి-పీలేరు ఈ నెల 24న పీలేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న రా.. కదిలిరా… కార్యక్రమాన్ని గ్రామాల వారీగా ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా.. కదలిరా… బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని, బుధవారం పార్టీ శ్రేణులతో స్థానిక టిడిపి కార్యాలయంలో మండల, గ్రామీణ ప్రాంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయి, భూత్‌ స్థాయిలో తమకు అనుకూలంగా ఉన్న వాహనాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల కార్పోరేషన్లను నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాలను తూట్లు పొడిచిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దింపడమే తెలుగుదేశం పార్ట్‌ లక్ష్యమని అన్నారు. అపద్దాలుచెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డిపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివ ద్ధి, తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, దుర్మార్గపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, రాష్ట్రంలో మళ్ళీ పూర్వవైభవం రావాలని అందుకు వచ్చే ఎన్నికల్లో అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు.

➡️