చంద్రశేఖర్‌ ఆజాద్‌కు ఘన నివాళి

Feb 27,2024 21:16

ప్రజాశక్తి- శృంగవరపుకోట:  స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ వర్ధంతిని ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ వాసుదేవ్‌ మాట్లాడుతూ చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్వతంత్ర పోరాటంలో చాలా కీలకపాత్ర పోషించాడని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ డాక్టర్‌. జి.ఈరన్న మాట్లాడుతూ చంద్రశేఖర్‌ ఆజాద్‌ 1928 సెప్టెంబర్‌లో భగత్‌ సింగ్‌ సుఖదేవ్‌ మొదలగు వారితో కలిసి హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారని వీరందరూ కలిసి లాలాజపతిరారు మరణానికి కారకుడైన స్కాట్‌ అనే బ్రిటిష్‌ పోలీసు అధికారిని చంపాలనుకున్నారని గుర్తు చేశారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్వాతంత్ర పోరాటంలో తన జీవితాన్ని పణంగా పెట్టి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ వి సుధీర్‌, పి భాస్కరరావు, జి సురేష్‌, కే అప్పలరాజు, డి హైమావతి, జి లక్ష్మణ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.తెర్లాం: స్థానిక శాఖా గ్రంథాలయంలో మంగళవారం చంద్రశేఖర్‌ ఆజాద్‌ 93వ వర్ధంతి నిర్వహించారు. శాఖ నిర్వహణాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్వాతంత్ర సమరయోధుడుగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️