చిరుత జాడ కోసం అన్వేషణ..!

Dec 14,2023 18:21
పులి జా డ కోసం పరిశీలిస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ బాలకష్ణ

పులి జా డ కోసం పరిశీలిస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ బాలకష్ణ
చిరుత జాడ కోసం అన్వేషణ..!
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు
మండలంలోని మండపం పంచాయతీ కాటేపల్లి శివాలయం పరిసర ప్రాంతంలో మహిళలకు చిరుత కనిపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ”కాటేపల్లిలో చిరుత కలకలం” అనే శీర్షికతో ఈ నెల 14వ తేదీ ”ప్రజాశక్తి”లో వార్త ప్రచురితం అయ్యింది. ఈ వార్తకు స్పందించిన అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ పి బాలకష్ణ గురువారం కాటేపల్లి సముద్ర తీరం అటవీ ప్రాంతంలో చిరుత పులి జాడ కోసం పరిశీలించారు. పులి అడుగుల గుర్తుల కోసం నీటి గుంటల వద్ద అన్వేషించారు. సెక్షన్‌ ఆఫీసర్‌ పరిశీలనలో, పులిజాడ గుర్తులు ఏవి కనిపించడం లేదని స్పష్టం చేశారు. పిల్లి జాతికి చెందిన గుర్తులున్నట్లు సెక్షన్‌ ఆఫీసర్‌ బాలకష్ణ తెలిపారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ పులి ఉన్నట్లయితే పశువులను గాని, మేకలను గాని, చంపి తినే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆహారం తిన్న తర్వాత పులి రోజుకి ఒక్కసారైనా నీటి కోసం బయటకు వస్తుందని చెప్పారు. కాగా అటవీ ప్రాంతంలో కొన్ని నీటి, కుంటల దగ్గర అడుగుల గుర్తులను పరిశీలించి, ఈ ప్రాంతంలో జంతువులు తిరుగుతున్నట్లు కాలి ముద్రలను బట్టి సెక్షన్‌ ఆఫీసార్‌ బాలకష్ణ తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అడిగి తెలుసు కున్నారు. ఇది అటవీ ప్రాంతం కాబట్టి స్థానికులు, ఆలయానికి వచ్చే ప్రజలు, సందర్శకులు అప్రమత్తంగా వుండాలని అయన సూచించారు.

➡️