చీపురుపల్లిలో ఎమ్‌పి బెల్లాన ఎన్నికల ప్రచారం

Mar 25,2024 21:16

ప్రజాశక్తి – చీపురుపల్లి : ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ సోమవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నియోజక వర్గంలో సంక్షేమంతో పాటు అబివృధ్ది జరిగిందన్నారు. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో అబివృధ్ది కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతైనా అవసరం ఉందని ప్రజలకు వివరించారు. తనను ఎంపిగా, బొత్స సత్యనారాయణను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అద్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్‌పిటిసి మీసాల వరహాలనాయుడు, ఎఎంసి ఛైర్మన్‌ దన్నాన జనార్దనరావు, కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఇప్పిలి సూర్యప్రకాశరావు, కోరుకొండ దాలయ్యతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శంబంగిబొబ్బిలి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మోసూరు వలస, ఎరకన్న దొరవలస, డుంగురువలస, చిలకమ్మవలస, విజయపురి గ్రామాలలో సోమవారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జెసిఎస్‌ కన్వీనర్‌ శంబంగి వేణుగోపాలనాయుడు, వైసిపి మండల అధ్యక్షుడు ఉత్తరావల్లి అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపి అరసాడ శంకరరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ తమ్మిరెడ్డి దామోదర్‌, ఎంపిటిసి గొర్లి తిరుపతిరావు, వైసిపి నాయకులు వివిధ గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాంశృంగవరపుకోట: ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు నెరవేర్చి మీ ముందుకు వస్తున్నామని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎమ్‌పిగా బొత్స ఝాన్సీలక్ష్మిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆదివారం రాత్రి మండలంలోని తిమిడి గ్రామ సందర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోక్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్‌, తిమిడి ఎంపిటిసి పదాల ధర్మారావు, వశి సర్పంచ్‌ బంగారు నాయుడు, పోతనాపల్లి సర్పంచ్‌ కూనిరెడ్డి వెంకటరావు, జెసీఎస్‌ మండల ఇంచార్జ్‌ వాకాడ సతీష్‌, ఎస్‌.కోట పట్టణ అధ్యక్షుడు రెహ్మాన్‌, సీనియర్‌ నాయకులు వెంకటేశ్వరరావు, సోంబాబు, మజ్జి శేఖర్‌ పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని నీలకంఠరాజుపురంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సోమవారం గ్రామ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ వివి చిన్న రామునాయుడు, మార్కెటింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, ఎంపిపి డి. సత్యవంతుడు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

➡️