చెంచమ్మకు నివాళి

ప్రజాశక్తి-కొండపి : కొండపి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు ఈదర కిరణ్‌ మాతృమూర్తి చెంచమ్మ దశదిన కర్మ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పాల్గొని చెంచమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అనకర్లపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి తన్నీరు సుబ్బారావు దశదిన కర్మలో పాల్గొని సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ జి.రామయ్యచౌదరి, టిడిపి మండల అధ్యక్షుడు బి.మలమందనాయుడు, బత్తుల నారాయణస్వామి, వసంతరావు, నరసారెడ్డి,యనమద్ని వెంకటేశ్వర్లు, టిడిపి యూత్‌ మండల అధ్యక్షుడు కాలేషా, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, దామా మురళి,ముక్కు ప్రసాదు, దేపూరి సుబ్బారావు, బాలనెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️