చెవిలో పూలతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

మున్సిపల్‌ కార్మికుల నిరసన

ప్రజాశక్తి – పెద్దాపురం, తునిసమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 3వ రోజుకు చేరుకుంది. మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు కార్మికులకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో మున్సిపల్‌ కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి వారి వేతనాలు పెంపుదలకు, వారి ఉద్యోగ భద్రత కోసం ఎందుకు మాట్లాడటం లేదన్నాని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, యూనియన్‌ నేతలు శివకోటి అప్పారావు, వర్రే గిరిబాబు, ఇసరపు దుర్గాప్రసాద్‌, సింగంపల్లి సింహాచలం, ముత్యాల దుర్గ, వర్రే భవాని, దొండపాటి శేషారావు, మడికి మోహన్‌ రావు, యాసలపు శ్రీకాంత్‌, వర్రె రాజేష్‌, కెవి.రమణ, బాసిన భద్రరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.తునిలో పారిశుధ్య కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సిఐటియు మండల కార్యదర్శి నక్కల శ్రీనివాస్‌ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. గొల్ల అప్పారావు సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అప్పారావు, కిషోర్‌, నూకరాజు, చిట్టిబాబు, శాంతకుమారి, ప్రభావతి పాల్గొన్నారు.

➡️