చేతులకు సంకెళ్లతో అంగన్వాడీల నిరసన

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని, ఒంటి కాలిపై నిల్చుని, ప్రభుత్వ బెదిరింపు జిఒ ప్రతులను దహనం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దొమ్మరాజు భాగ్యలక్ష్మి, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు ఎస్‌.మస్రూన్‌ బీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా గురువారం రాయచోటిలోని తVశీల్దార్‌ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్‌ చిత్రపటం దగ్గర మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె 24వ రోజయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనలకు రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ లీడర్లు సిద్దమ్మ, విజయ, అరుణ ఖాజాబి, సుమలత, అరుణ, విజయమ్మ, రామంజులమ్మ, ప్రవీణ, సబీనా, రమీజా, ఇందిరమ్మ, పద్మజ, శంకరమ్మ, మంజుల, భూదేవి, సురేఖ పాల్గొన్నారు. మదనపల్లి : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ప్రభుత్వ జిఒ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, హరింద్రనాథ్‌ శర్మ, నాయకులు మధురవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ 24 రోజులుగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి, అంగన్వాడీలు పాల్గొన్నారు. రైల్వేకోడూరు :అంగన్వాడీలు ఐసిడిఎస్‌ కార్యాలయం సమీపంలో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పి.జాన ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జయరాం, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌, సిఐటియు అనుబంధం, జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మీ, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి, అధ్యక్షులు, శ్రీరమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాధా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మావతి, వెన్నెల, దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, నాయకులు సరోజ నిర్మల నాగమణి పాల్గొన్నారు. బి.కొత్తకోట : ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని అంగన్వాడీలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని దహనం చేశారు. కార్యక్రమంలో బి.కొత్తకోట ఐసిడిఎస్‌ కార్యాలయ పరిధిలోని అంగన్వాడీలు,హెల్పర్లు పాల్గొన్నారు. ములకలచెరువు : అంగనవాడీల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయ చంద్రారెడ్డి అన్నారు. తంబళ్లపల్లె-మదనపల్లి ప్రధాన రహదారిలో తమ సమస్యల పరిష్కారానికి రోడ్డుపై బైఠాయించిన అంగన్వాడీలకు ఆయన సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా బైఠాయించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మంత్రి గిరిధర్‌రెడ్డి, ఆంజనేయ రెడ్డి, మస్తాన్‌రెడ్డి, రంగారెడ్డి, విశ్వనాధ్‌ రెడ్డి, భాస్కర్‌, ఫజ్జులల్లా, జనసేన నాయకుడు నరేందర్‌ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు దహనం చేసి అంగన్వాడీలు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సుకుమారి, కార్యదర్శి ఓబులమ్మ, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గాలివీడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️