70 మందికి వైద్యపరీక్షలు

పజాశక్తి-కొండపి : కొండపి మండలం చోడవరం గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపంలో కీర్తిశేషులు, మాజీ వైస్‌ ఎంపిపి రావిపాటి మధుసూదనరావు జ్ఞాప కార్ధం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉచిత మెగా గుండె వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ హెల్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు 70 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో10 మందిని విజయవాడ ఆసుపత్రికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం రిపర్‌ చేశారు. ఈ వైద్య శిబిరంలో ఆయాసం, గుండెలో నొప్పి, గుండె దడ, మంట, బరువుగా ఉండటం, బిపి, షుగర్‌ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బిపి ,షుగర్‌ పరీక్షలు తరచూ చేయించుకోవాలన్నారు. ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యుడు డాక్టర్‌ జ్వాలసాయి, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ సర్పంచి స్వర్ణ నవీన్‌కుమార్‌, మాజీ సర్పంచి గుంటుపల్లి హరిప్రసాదు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గోగినేని వెంటరావు, బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️