జగనన్నకు చెబుదాం’కు 140 అర్జీలు

Feb 26,2024 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 140 అర్జీలు అందజేశారు. ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని ఇన్‌ఛార్జ్‌ జాయింటు కలెక్టరు సి.విష్ణుచరణ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, ఆర్‌డిఒ కె.హేమలత ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.స్పందన ఫిర్యాదులపై న్యాయం చేస్తాం : ఎస్‌పి పార్వతీపురంరూరల్‌ : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, ఎఎస్పీ(అడ్మిన్‌)తో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల రాతపూర్వక అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ స్పందన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు, జాబ్‌ మోసాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజలు వినతులను ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో 6 ఫిర్యాదులు అందాయి. స్పందనలో ఎఎస్పీ(అడ్మిన్‌) డాక్టర్‌ ఓ.దిలీప్‌ కిరణ్‌, ఎస్‌బి సిఐ సిహెచ్‌.లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ సిహెచ్‌.వాసునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.ఐటిడిఎలో….సీతంపేట : సమస్యలు పరిష్కరించాలని పలువురు గిరిజనులు స్పందనలో వినతులు సమర్పించారు. సోమవారం గిరిజన స్పందన ఐటిడిఎలో పిఒ కల్పనా కుమారి ఆధ్వర్యంలో జరిగింది. పారబొంతుకు చెందిన పోలయ్య డి-పట్టా ఇప్పించాలని కోరారు. పెద్దూరుకు చెందిన సుందరరావు మినీ అంగన్‌వాడీ భవనం మంజూరు చేయాలని కోరారు. సవర గొయిదికి చెందిన రవి పెట్రోల్‌ బంకులో పంపు బారు ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. సన్యాసిపేటకు చెందిన మౌనిక కుట్టు మిషన్‌ మంజూరు చేయాలని కోరారు. ఎగువ బందలోయకు చెందిన దుర్గారావు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కోరారు. తుంబలిగూడకు చెందిన బద్రి కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని విన్నవించారు. గదబపేటకు చెందిన సత్యనారాయణకు కొండపోడు పట్టా ఇప్పించాలని కోరారు. స్పందన కార్యక్రమానికి 35 విన్నతులు వచ్చాయి. కార్యక్రమంలో ఎపిఒ రోషిరెడ్డి, డిడి అన్నదొర, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సింహాచలం, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, సిడిపిఒ రంగలక్ష్మి, పిహెచ్‌ఒ గణేష్‌, పిఎఒ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️