జగనన్నకు చెబుదాంకు 205 వినతులు

Dec 18,2023 19:51

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  కలెక్టరేట్‌లో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్‌డిఒ సూర్యకళ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వర రావు, బి.సుదర్శన దొర, రాజేశ్వరి, సుమబాల, సుధారాణి , తదితరులు వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం కోసం పంపించారు. జగనన్నకు చెబుదాంకు మొత్తం 205 వినతులు అందగా వీటిలో అత్యధికంగా రెవిన్యూ శాఖకు సంబంధించి 134 ఉన్నాయి. ఆయా శాఖలకు అందిన వినతులను సకాలంలో అర్జీదారుల సంతప్తి మేరకు పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.నీలయ్యమ్మ సత్రం భూమిని కాపాడాలి నగరంలోని శిల్పారామంకు ఆనుకొని దేవాదాయశాఖకు చెందిన నీలయమ్మ సత్రం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వెంటనే అధికారులు ఆ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని టిడిపి నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌ కోరారు. సోమవారం స్పందనలో అధికారులకు వినతినిచ్చారు. సర్వే నెంబర్‌ 366లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం దేవాదాయ శాఖ చెందిన భూమి ఉందన్నారు. దేవాదాయ చట్టం ప్రకారం భూములను ఎవరికైనా లీజుకు ఇవ్వదలిస్తే దేవాదాయ శాఖ ద్వారా పత్రికల్లో ప్రకటన ఇచ్చి నియమ నిబంధనలు తెలియపరచి పబ్లిక్‌ అక్షన్‌ ద్వారా కేటాయించాల్సిఉందన్నారు. ఇప్పటికే కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి ఎవరిష్టంసారంగా వారు ఆక్రమించుకోవడం జరుగుతుందన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, మండల పార్టీ కార్యదర్శి గంటా పోలి నాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, మాజీ వైస్‌ చైర్మన్‌ కనకల మురళీమోహన్‌, కంది మురళి నాయుడు తదితరులు పాల్గొన్నారు.ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలిస్పందన అనంతరం సంయుక్త కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు మొదలైందని, ప్రత్యేకాధికారులు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి అన్ని చోట్ల ప్రారంభించింది లేనిదీ తనిఖీలు చేయాలన్నారు. గన్నీ సంచులు ఉన్నదీ లేనిదీ , కొనుగోలులో ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి గానీ డిఎస్‌ఒ దృష్టికి గానీ తేవాలని సూచించారు

➡️