జగనన్నకు చెబుదాంలో వినతుల వెల్లువ

Jan 29,2024 20:29

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 311 వినతులు అధికారులకు అందాయి.వాటిలో రెవెన్యూకు సంబంధించి 120 వినతులు ఉన్నాయి. డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు సుదర్శనదొర, సుమబాల తదితరులతో కలసి వినతులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు పరిష్కారంకోసం సిఫారసు చేశారు. టోల్‌గేట్‌ పనులు వెంటనే ఆపాలి జొన్నాడ సమీపంలో గోడమెట్టపాలెం వద్ద టోల్‌గేటు ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న పనులను వెంటనే ఆపాలని టిడిపి నియోజకవర్గ నాయకులు వినతినిచ్చారు. విజయనగరం- విశాఖపట్నం రహదారిలో టోల్‌గేటే ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులపై అధిక భారం పడుతుందని తెలిపారు. ఇది జాతీయ రహదారి కాదని అన్నారు. ప్రభుత్వం స్పందించి టోల్‌గేట్‌ ఆపాలని కోరారు. వినతినిచ్చిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి .రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కోండ్రు శ్రీనివాసరావు, కనకల మురళీమోహన్‌ ఇతర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు . రైతుల దగ్గర గల ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని టిడిపి నాయకులు వినతినిచ్చారు. 2022 – 23 రైతులు పంట బీమా నష్టాన్ని ఇప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో ఇవ్వాలన్నారు. జిల్లాలో బెల్ట్‌ షాపులను వెంటనే ఆపాలని గౌతు లచ్చన్న కల్లుగీత వత్తిదారుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. డేటా ఆప్‌లోడ్‌ చేయాలి : డిఆర్‌ఒఎన్నికల విధులకు సంబంధించిన పోర్టల్‌ లో అధికారుల, సిబ్బంది వివరాను పోలింగ్‌ పర్సనల్‌ మేనేజ్మేంట్‌ సిస్టంలో డేటా అప్‌లోడ్‌ చేయాలని డిఆర్‌ఒ అనిత తెలిపారు. ఆన్లైన్‌ లో ఎలా అప్లోడ్‌ చేయాలనే అంశాల పై ఎన్‌ఐసి డిఐఒ బాలసుబ్రహ్మణ్యం అధికారులకు అవగాహన కలిగించారు. అన్ని శాఖల కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఎన్‌ఐసిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

➡️