జగనన్న కిట్లు పంపిణీ

Nov 28,2023 20:49
కిట్లు పంపిణీ చేస్తున్న దృశ్య

కిట్లు పంపిణీ చేస్తున్న దృశ్య
జగనన్న కిట్లు పంపిణీ
ప్రజాశక్తి-కందుకూరుమండలంలోని కోవూరు గ్రామ సచివాలయ పరిధిలో ‘మా నమ్మకం నువ్వే’ జగనన్న” ‘ఆంధ్రప్రదేశ్‌ కి జగనే ఎందుకు కావాలంటే” కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి సూచనతో స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి వైసిపి జెండాను ఆవిష్కరించారు. కోవూరు సచివాలయంలో ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఎంత లబ్ధి పొందింది తెలియజేసేలా సంక్షేమ పథకం బోర్డు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కోవూరు గ్రామ సర్పంచ్‌ సచివాలయం ఆవుల మాధవరావు అధ్యక్షత వహించగా కందుకూరు మండల వైయస్‌ఆర్సీపీ అధ్యక్షుడు గంగవరపు వెంకటరావు, జెసిఎస్‌ కో ఆర్డినేటర్‌ చీమల వెంకట రాజా, కొండి కందుకూరు సర్పంచ్‌ కుమ్మర బ్రహ్మయ్య, జి.మేకపాడు సర్పంచ్‌ గూడపాటి బ్రహ్మయ్య, జెడ్పీటీసీ ప్రతినిధి తొట్టెంపూడి శ్రీనివాసరావు , ఎంపీపీ ప్రతినిధి ఇంటూరి మాధవ రావు, కోవూరు ఎంపీటీసి సుందరరావు , కోవూరు మాజీ సర్పంచ్‌ నేలకూరి మాల్యాద్రి, కోవూరు సచివాలయం కన్వీనర్లు దారుకుమల్లి నాగేంద్రమ్మ, రామాంజనేయులు ఉన్నారు.

➡️